యువకుడి దుర్మరణం | youngster dead | Sakshi
Sakshi News home page

యువకుడి దుర్మరణం

Sep 4 2016 12:56 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఏలూరు అర్బన్‌ : బైకుపై స్నేహితునితో కలిసి ఇంటికి వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఏలూరు అర్బన్‌ : బైకుపై స్నేహితునితో కలిసి ఇంటికి వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళం రాము (26) అనే యువకుడు స్నేహితుడు శివాజీతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై ఏలూరు నుంచి లక్ష్మీపురం బయలుదేరాడు. మార్గమధ్యలో తంగెళ్లమూడి ప్రాంతంలోని జేఎంజే స్కూల్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందగా శివాజీ గాయాలపాలయ్యాడు. ఏలూరు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని, మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement