పోలీసులు వేధింపులు తాళలేక ఓ యువకుడు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
పోలీసులు వేధింపులు తాళలేక ఓ యువకుడు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన అచ్యుత నాగరాజు సోమవారం ఏలూరు కలక్టర్ కార్యలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో సమిశ్రగూడెం ఎస్సైతో పాటు మరో పది మంది తమను వేధింపులకు గురిచేస్తున్నారని.. అందుకే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. మా చావుకు సమిశ్రీగూడెం ఎస్సై, ముప్పిడి మంగయ్య, దండుబోయిన నాగలక్ష్మీ, అక్రమ్, పి. మల్లేశ్వర్రావు, సుబ్బరాయుడు, విష్ణు, తోట రమేష్, తోట మంగ కుటుంబ సభ్యులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.