సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి | yeruvaka program east godavri | Sakshi
Sakshi News home page

సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి

Jun 9 2017 11:51 PM | Updated on Sep 5 2017 1:12 PM

సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి

సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి

పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొల

- సకాలంలో నీరిచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాదే
- ఏరువాకలో ఉప ముఖ్య మంత్రి చిన రాజప్ప
పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి  రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొలమూరులో జిల్లాస్థాయి శుక్రవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చినరాజప్ప మాట్లాడుతూ  రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి సాగునీటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ నామన రాంబాబు మాట్లాడుతూ రసాయన ఎరువుల విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గి తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. జిల్లా కలక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు ప్రత్యామ్మాయ మార్గాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జేష్ట పౌర్ణమి రోజున రైతులు తొలి అరక దున్ని సాగును ప్రారంభించటం ఆనవాయితీకి అనుగుణంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, పశు సంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఏరువాకలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పొలమూరులోని వ్యవసాయ క్షేత్రంలో భూమితల్లికి, నాగలికి పూజలు నిర్వహించి కాడెద్దులతో దుక్కిదున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మి, ఫిషరీస్‌ జెడీ కోటేశ్వరరావు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బిఎంవి రామరాజు ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ భాస్కరరావు, ఏరువాక శాస్త్రవేత్త ప్రవీణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement