యాగాలతో ఇనుమడించే తేజస్సు | yagalato inumadinche tejassu | Sakshi
Sakshi News home page

యాగాలతో ఇనుమడించే తేజస్సు

Jul 21 2016 12:41 AM | Updated on Sep 4 2017 5:29 AM

దువ్వ (తణుకు టౌన్‌) : పవిత్ర దేవాలయాల్లో ధర్మాధికారులు, అర్చకులు భక్తి విశ్వాసాలతో వివిధ హోమాలు, యాగాలు చేయడం ద్వారా దేవతామూర్తుల్లో తేజస్సు, శక్తి, మహిమ పెరుగుతాయని కంచి కామకోటి పీఠాధిపతుల శిషు్యలు కళావాచస్పతి శ్రీనారాయణేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు.

దువ్వ (తణుకు టౌన్‌) : పవిత్ర దేవాలయాల్లో ధర్మాధికారులు, అర్చకులు భక్తి విశ్వాసాలతో వివిధ హోమాలు, యాగాలు చేయడం ద్వారా దేవతామూర్తుల్లో తేజస్సు, శక్తి, మహిమ పెరుగుతాయని కంచి కామకోటి పీఠాధిపతుల శిషు్యలు కళావాచస్పతి శ్రీనారాయణేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. బుధవారం తణుకు రూరల్‌ మండలం దువ్వ గ్రామంలోని శ్రీనాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో కలుష భావాలు తొలగాలన్నారు. ధర్మాసక్తి, దైవ భక్తి, కలగడంతో ప్రజలకు మనశ్శాంతి ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. వీటి ఫలి తంగా సనాతన భారతీయ హిందూ మత పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా రుద్రహవనం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం గ్రామంలో మహిళలు వెయ్యి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు.  ప్రభుత్వ ఆగమన సలహాదారు జంధ్యాల జగన్నా«థశాస్త్రి, జంధ్యాల బాలకృష్ణ, కామర్సు సూర్య రామారావు, టీటీడీ చతుర్వేద పండితులు జాగర్లపూడి వీరభద్ర శర్మ పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement