పుష్కరాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న గజ ఈతగాళ్లు
కృష్ణా పుష్కరఘాట్ల వద్ద సేవలు అందించేందుకు గజ ఈతగాళ్లు అస్త్రసస్త్రాలతో సన్నద్ధమయ్యారు. వారం రోజులుగా కృష్ణానది పోటెత్తి పరవళ్లు తొక్కుతుండడంతో పుష్కర ఘాట్లన్నీ మునిగిపోయాయి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అందరిదృష్టి వీరిపైనే పడింది.
గద్వాల: కృష్ణా పుష్కరఘాట్ల వద్ద సేవలు అందించేందుకు గజ ఈతగాళ్లు అస్త్రసస్త్రాలతో సన్నద్ధమయ్యారు. వారం రోజులుగా కృష్ణానది పోటెత్తి పరవళ్లు తొక్కుతుండడంతో పుష్కర ఘాట్లన్నీ మునిగిపోయాయి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అందరిదృష్టి వీరిపైనే పడింది. ఈ మేరకు నది అగ్రహారం, పెద్ద చింతరేవుల, బీరెల్లి పుష్కరఘాట్లలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నీటి ప్రవాహంలో రక్షణ వలయాలను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.