కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత | villagers stopped Cattle to Kabela in ranga reddy district | Sakshi
Sakshi News home page

కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

Nov 13 2015 7:53 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేలాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ఘట్‌కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా  ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement