వైశ్యులు ఐక్యంగా ఉన్నపుడే బలోపేతమవుతారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని బుధవారం దర్శించారు. ఆయన వెంట నెల్లూరు ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, కడప ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు దొంతు సుబ్రమణ్యం పాల్గొన్నారు.
	పోరుమామిళ్ల:  వైశ్యులు ఐక్యంగా ఉన్నపుడే బలోపేతమవుతారని రాజ్యసభ సభ్యుడు  టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని బుధవారం  దర్శించారు. ఆయన వెంట నెల్లూరు ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, కడప ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు దొంతు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షుడు  గుబ్బా చంద్రశేఖర్ కన్యకాపరమేశ్వరి, శివాలయం, రామాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన ప్రతిష్ఠ ఉత్సవాల్లో   సేవలందించినవారికి టీజీ వెంకటేష్ మెమొంటోలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.టీజీ వెంకటేష్‌ను ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు గుబ్బా చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు  సన్మానించారు. కన్యకాపరమేశ్వరి వెండి పటాన్ని  అందజేశారు.  మండల ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు తులసి సుధాకర్ ఆయనను సన్మానించారు.  నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్‌ను కమిటీ సభ్యులు సన్మానించారు.
	 
	 
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
