గోదావరి నదిలో నలుగురు గల్లంతు, ఇద్దరి మృతి | Two dead bodies found in Godavari river | Sakshi
Sakshi News home page

గోదావరి నదిలో నలుగురు గల్లంతు, ఇద్దరి మృతి

Oct 4 2015 7:58 AM | Updated on Aug 25 2018 5:41 PM

తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు చినకొండెపూడి గ్రామానికి చెందిన వీరబాబు (28), కనక దీపిక (12) గా పోలీసులు గుర్తించారు.

మాల ధారణ ముందు గోదావరిలో స్నానం చేయాలని అనుకుని శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో దిగారు. ప్రవాహ ఉధృతికి  వారిద్దరూ కొట్టుకుపోయారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహలు లభ్యమైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement