స్కూల్ బస్సు బోల్తా : విద్యార్థులకు గాయాలు | Twenty students injured in school bus overturend in Mahaboob nagar | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా : విద్యార్థులకు గాయాలు

Jul 24 2015 1:09 PM | Updated on Nov 9 2018 4:44 PM

మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి వద్ద రహదారిపై బుధవారం స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు.

మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి వద్ద రహదారిపై బుధవారం స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...స్థానికుల సహాయంతో విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అధిక వేగంతో వెళ్తున్న స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement