కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడంతో జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో టపాసులు పేల్చారు. టీఆర్‌ఎస్‌వై జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బోనాల శ్రీకాంత్, నాయకులు బోనాల రాజేశం, కన్న కృష్ణ, జక్కుల నాగరాజు, మైఖేల్ శ్రీనివాస్, దండబోయిన రాము, పెండ్యాల మహేశ్, జక్కం నర్సయ్య పాల్గొన్నారు.