చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం | Tree, the man who hung himself balavanmaranam | Sakshi
Sakshi News home page

చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం

Aug 22 2016 12:11 AM | Updated on Sep 4 2017 10:16 AM

మానసిక స్థితి బాగా లేక మండలంలోని బాబోజీగూడేనికి చెందిన భీమనపెల్లి రామ్మూర్తి(60) గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరిపెడ : మానసిక స్థితి బాగా లేక మండలంలోని బాబోజీగూడేనికి చెందిన భీమనపెల్లి రామ్మూర్తి(60) గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి కుటుంబం పదిసంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ రామ్మూర్తి కల్లుకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈనెల 19న హైదరాబాద్‌ నుంచి బాబోజీగూడేనికి చేరుకున్నాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న అనుమానంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి గ్రామానికి వచ్చారు. ఈనెల 20న ఉదయం బయటికి వెళ్లిన రామ్మూర్తి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా గ్రామశివారులోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement