కలెక్టరేట్ ఎదురుగా అనంతసాగరం చెరువు సమీపంలో ట్రాక్టర్‌బోల్తా పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రాక్టర్ బోల్తా ... ముగ్గురికి తీవ్రగాయాలు
Sep 25 2016 12:19 AM | Updated on Aug 28 2018 7:08 PM
అనంతపురం సెంట్రల్ : కలెక్టరేట్ ఎదురుగా అనంతసాగరం చెరువు సమీపంలో ట్రాక్టర్‌బోల్తా పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక టీవీటవర్‌కు చెందిన చెన్నయ్య, శీనా, సదా అనే హమాలీలు శనివారం సాయంత్రం ఇటుక పెళ్లలను ట్రాక్టర్‌లో తీసుకుని నగరంలోకి వస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గాండ్లపెంటలో ఇద్దరికి ..
గాండ్లపెంట : మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. కదిరి నుంచి వస్తున్న నైముల్లా మద్దివారిగొంది సమీపంలో కదిరి–రాయచోటి ప్రధాన రోడ్డులోకి రాగానే కింద పడా గాయపాడ్డాడు. అలాగే కమతంపల్లి సమీపంలోని పెద్ద వేపమాను వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్‌బ్రేకర్ల వద్ద వాహనం అదుపు తప్పి ఎన్‌పీ కుంట మండలం వెలిచలమల గ్రామ సర్పంచ్ రఘనాధరెడ్డి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రులను స్థానికులు అనంతపురం తరలించారు.
Advertisement
Advertisement