‘శంకరాభరణం ’ నా పేరులో భాగమైంది | Sakshi
Sakshi News home page

‘శంకరాభరణం ’ నా పేరులో భాగమైంది

Published Tue, Apr 5 2016 3:11 PM

‘శంకరాభరణం ’ నా పేరులో భాగమైంది - Sakshi

అన్నవరం : కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమా తనకు ఎంతో పేరు తెచ్చిందని, ఆ సినిమా పేరు తన పేరులో భాగమైందని ప్రముఖ నటి శంకరాభరణం రాజ్యలక్ష్మి అన్నారు.  సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలసి  రత్నగిరిపై సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని  దర్శించుకున్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా వలనే తాను చాలా గుర్తింపు పొందానన్నారు.

సత్యదేవుని సన్నిధికి వచ్చినా, అన్నవరం మీదుగా ప్రయాణించినా తనకు ఆ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయన్నారు. తాను ఆ సినిమా తరువాత సుమారు 200  సినిమాలలో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బాటు  టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్టు శంకరాభరణం రాజ్యలక్ష్మి తెలి పారు.  ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు  స్వాగ తం పలి కారు. అనంతరం పండితులు వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
Advertisement