రెండో రోజు కొనసాగిన సీఐడీ అధికారుల విచారణ | To day also continue in cid investigation | Sakshi
Sakshi News home page

రెండో రోజు కొనసాగిన సీఐడీ అధికారుల విచారణ

Dec 17 2016 10:37 PM | Updated on Aug 11 2018 8:21 PM

హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో శనివారం కూడా విచారణ కొనసాగింది. శుక్రవారం వైఎంఆర్‌ కాలనీలోని హౌస్‌బిల్డింగ్‌ సొసైటీపై వచ్చిన పలు అభియోగాలపై సీఐడీ సీఐ కళావతి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రొద్దుటూరు క్రైం: హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో శనివారం కూడా విచారణ కొనసాగింది. శుక్రవారం వైఎంఆర్‌ కాలనీలోని హౌస్‌బిల్డింగ్‌ సొసైటీపై వచ్చిన పలు అభియోగాలపై సీఐడీ సీఐ కళావతి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి రోజు అధికారులను ఆమె విచారించారు. కందుల బాలనారాయణరెడ్డి కాలనీకి సంబంధించిన ఫ్లాట్లలో బినామీల పేరుతో విక్రయాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లు సమాచారం. శనివారం కాలనీకి  వెళ్లిన సీఐ ఫ్లాట్లను పరిశీలించారు. ఫ్లాట్ల వారీగా పేర్లను పరిశీలించి వారు బినామీలా లేక అసలు వ్యక్తులా అనే విషయమై ఆరా తీశారు. అధికారులతో పాటు కొందరు పాలకవర్గ సభ్యులను కూడా ఆమె విచారించారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని సీఐ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement