ఓ చర్చి ఫాదర్‌ను కిడ్నాప్ చేసి చితకబాది తరువాత విడుదల చేసిన సంఘటన ఖాజీపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
	ఓ చర్చి ఫాదర్‌ను కిడ్నాప్ చేసి చితకబాది తరువాత విడుదల చేసిన సంఘటన ఖాజీపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. కడపలోని ఆర్సీఎం చర్చి బిషప్ ప్రసాద్ సోమవారం కరుణగిరి తిరునాళ్లకు హాజరయ్యారు. ఆయన తిరిగి వస్తుండగా ఖాజీపేట సమీపంలో చిల్లకం వద్ద సోమవారం అర్ధరాత్రి అగంతకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం ఆయన్ని బాగా చితకబాది తెల్లవారు జామును వదిలేశారు. తీవ్రంగా గాయపడిన బిషప్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
