మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే | thota gopala krishna death cermony | Sakshi
Sakshi News home page

మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే

Jan 5 2017 10:49 PM | Updated on Sep 5 2017 12:30 AM

మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే

మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే

సామర్లకోట: వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో మంచి టీం వర్కు చేస్తే 2019 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తోట గోపాలకృష్ణ 5వ వర్ధంతి సందర్బంగా గురువారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ భవనంలో పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ము

తోట గోపాలకృష్ణ వర్ధంతి సభలో కన్నబాబు
సామర్లకోట: వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో మంచి టీం వర్కు చేస్తే 2019 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తోట గోపాలకృష్ణ 5వ వర్ధంతి సందర్బంగా గురువారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ భవనంలో పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తోట గోపాల కృష్ణ  ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన ఆయన తనయుడు తోట సబ్బారావునాయుడును 2019లో ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగు పెట్టే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపు నిచ్చారు. సుబ్బారావు నాయుడుకు జిల్లా పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గోపాలకృష్ణ వర్దంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ టౌన్‌ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్, జగ్గంపేట కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాసు, పెద్దాపురం కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు అభినందనలు తెలిపారు.
గోపాలకృష్ణ ఉన్న చోట అలసటను మరిచి పోయేవారం
ఓదార్పు యాత్రలోను, ఎన్నికల ప్రచారంలోను అలిసి పోయిన సమయంలో తోట గోపాలకృష్ణ ఉంటే అలసట మరచి పోయేవారమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు.   గోపాలకృష్ణ ఆశయాలు అమలు చేయడానికి సుబ్బారావునాయుడును ఎమ్మెల్యేగా చేయాలన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, జిల్లా , నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు రక్తదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement