breaking news
gopala
-
నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
సివిల్ సర్వీస్‌లో 3వ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ నన్నయ్య వర్సిటీ, లెనోరా దంత వైద్య కళాశాలలో ఘన సత్కారం ‘నీ జేబులో గ్రీనింకు పెన్ను ఉండాలిరా, నీ ద్వారా మనలాంటి పేదలెందరికో సేవలందాలిరా’ అన్న నాన్న మాటలే... సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు ప్రేరణ. నాన్న కోరికను లక్ష్యంగా చేసుకున్న అతడు 11 ఏళ్లపాటు కఠోరంగా శ్రమించాడు. కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు నిరుత్సాహపరిచినా.. పేదరికం అడ్డంకిగా మారిన.. అతడి గురి లక్ష్యంపైనే ఉంది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రంలోనే ఎవరూ సాధించలేని ఈ ర్యాంకును... తెలుగు మీడియంలో పరీక్ష రాసిన ఇతడు సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. అందుకే తెలుగు ప్రజలు ఇతడికి నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఇతడిపై విద్యార్థులతో సమానంగా అధ్యాపకులు, అచార్యులు కూడా ప్రేమాభిమానాలు కురిపించారు. వారి అభిమాన వర్షానికి తడిచి ముద్దైన గోపాలకృష్ణ వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రాజానగరం : ‘తెలుగు మీడియంలో చదువుకున్నా, పేదరికం అడ్డంకిగా ఉన్నా.. నాన్న కోరికను తీర్చడంతోపాటు నా లక్ష్యాన్ని కూడా సాధించాలనే తపనతో 11 సంవత్సరాలపాటు కఠోరంగా శ్రమించాను’ అంటూ... అంటూ సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులు, ఆచార్యులను మంత్రముగ్ధులను చేసింది. నగరానికి వచ్చిన మంగళవారం అతడిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోణంకి మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్టపడుతుంటే కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు కాస్త నిరుత్సాహపరిచినా వెనుకంజవేయలేదన్నారు. అప్పటికే చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం ఆత్మస్ధైర్యాన్నిచ్చిందన్నారు. ఇంత ర్యాంకు సాధించడంలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు, లక్ష్యాన్ని సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ బడులలోనే ఉన్నత విద్య సాగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ తరువాత టీటీసీ చేసి డీఎస్సీ రాయడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చిందన్నారు. అయితే సివిల్స్ కోసం డిగ్రీ ప్రైవేటుగా చదివానన్నారు. ఇలా 11 ఏళ్లు కఠోర శ్రమతో మూడుసార్లు విఫలమై..నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ఇంతవరకూ పడిన కష్టమే రేపు మంచి పరిపాలనాధికారిగా తీర్చిదిద్దుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరీక్షకు ప్రివేర్ అయిన తీరు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షకు ఏవిధంగా ప్రిపేర్ కావాలి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలనే విషయాలను కూలకషంగా వివరించారు. ఇంటర్య్వూతోపాటు 2,025 మార్కులకు 1,104 మార్కులే తనకు వచ్చాయన్నారు. తన ప్రసంగం వింటున్న విద్యార్థులలో కనీసం ఒకరిద్దరైనా సివిల్స్ లక్ష్యం వస్తే ఇక్కడకు వచ్చినందుకు ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లిష్‌లో చదువుకున్న వారే విజయం సాధిస్తారనే భావాన్ని విడనాడాలని, భాష ఏదైనా భావం ఉండాలనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా దంత వైద్య కళాశాలలో విద్యాభ్యాసంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. నాడు బుర్రా, నేడు రోణంకి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసులో 1993లో బుర్రా వెంకటేష్ 12వ ర్యాంకును సాధిస్తే నేడు రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకును పొందారని నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో మొదటి ర్యాంకును సాధించేవారెవ్వరని విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే ఈ రోజుల్లో తెలుగులో పరీక్ష రాసి ఈ ర్యాంకును పొందడం సా«ధారణ విషయం కాదన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు కావడం మరీ విశేషమన్నారు. కేఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి మట్లాడుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం లోపం ఉండకూడదన్న విషయాన్ని గోపాలకృష్ణ నిరూపించారన్నారు. ఘన సత్కారం అనంతరం గోపాలకృష్ణను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. నన్నయ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో నన్నయ అధ్యాపక బృందం ఆచార్య ఎస్.టేకి, ఆచార్య మట్టారెడ్డి, ఆచార్య పి.సురేష్‌వర్మ, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ ఆలీషాబాబు, ఈసీ మెంబర్ విజయనిర్మల, డీఎస్పీ రమేష్‌బాబు, సింగపూర్ సిటీ బ్యాంకు ఉపాధ్యక్షులు అనుమోలు సారథి, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్రెడి, వైస్ ప్రిన్సిపాల్ ధల్‌సింగ్, డైరెక్టర్లు లక్ష్మణరావు, నాగార్జనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే
తోట గోపాలకృష్ణ వర్ధంతి సభలో కన్నబాబు సామర్లకోట: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో మంచి టీం వర్కు చేస్తే 2019 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తోట గోపాలకృష్ణ 5వ వర్ధంతి సందర్బంగా గురువారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తోట గోపాల కృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన ఆయన తనయుడు తోట సబ్బారావునాయుడును 2019లో ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగు పెట్టే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపు నిచ్చారు. సుబ్బారావు నాయుడుకు జిల్లా పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గోపాలకృష్ణ వర్దంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ టౌన్ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు అభినందనలు తెలిపారు. గోపాలకృష్ణ ఉన్న చోట అలసటను మరిచి పోయేవారం ఓదార్పు యాత్రలోను, ఎన్నికల ప్రచారంలోను అలిసి పోయిన సమయంలో తోట గోపాలకృష్ణ ఉంటే అలసట మరచి పోయేవారమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గోపాలకృష్ణ ఆశయాలు అమలు చేయడానికి సుబ్బారావునాయుడును ఎమ్మెల్యేగా చేయాలన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, జిల్లా , నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు రక్తదానం చేశారు. -
గోపాలబాబా పార్ధివ దేహానికి అంత్యక్రియలు
పిఠాపురం టౌన్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అవధూతగా భక్తులు కొలిచే గోపాలబాబా పార్ధివ దేహానికి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం అంతిమ సంస్కారం నిర్వహించారు. బాబా దేహాన్ని ఆయన పడక గదిలోనే శాస్త్రోకంగా సమాధి చేశారు. బాబా పవిత్ర దేహానికి పంచ గవ్యాలు, పుష్కర జలాలు, పంచ లోహాలు, నవరత్నాలతో అభిషేకించి తులసి, మారేడు, గన్నేరు పత్ర, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిమాలయ యోగులు, సద్గురువులు పాల్గొన్నారు.బాబా సమాధి కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకూ సాగింది. సమాధిలో కర్పూరం, ఉప్పు, పచ్చ కర్పూరం, విభూది వేశారు. పిఠాపురం బైపాస్ రోడ్డులో గోపాలబాబా ఆశ్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు, వీక్షించేందుకు బయట వ్యక్తులను, పాత్రికేయలను నిర్వాహకులు అనుమతించలేదు. ఆశ్రమ ప్రాంగణంలోని ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి బాబా అంత్యక్రియలను ప్రదర్శించారు. భక్తులు గోపాలబాబా అంత్యక్రియలను తెరలపై వీక్షించి దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయారు. గోపాలబాబాను సమాది చేసిన చోటును ఆలయంగా తీర్చిదిద్ది భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇకపై కూడా ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని వారు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే బాబా పార్ధివ దేహాన్ని దర్శించుకున్నారు. -
'బాబు' దుర్మార్గపు ఆలోచనలు అభివృద్ధికి ఆటంకం..