పద్మావతి ఘాట్లో దొంగలు హల్చల్ | thieves hulchul in padmavathi ghat | Sakshi
Sakshi News home page

పద్మావతి ఘాట్లో దొంగలు హల్చల్

Aug 13 2016 7:41 AM | Updated on Aug 28 2018 7:30 PM

కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్లో శనివారం దొంగలు హల్చల్ చేశారు.

విజయవాడ : కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్లో శనివారం దొంగలు హల్చల్ చేశారు. నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల దృష్టి మరల్చి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అలా వచ్చిన భక్తులకు చెందిన రూ. 4500, మూడు తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్ అపహరించుకుని పోయారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement