మండలంలోని వేములపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన రామాంజనేయులు అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
యాడికి : మండలంలోని వేములపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన రామాంజనేయులు అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి అతడు వేములపాడులోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి బీరువాను పగులగొట్టేందుకు యత్నించాడు.
ఇంటి యజమానులు గమనించి పట్టుకోబోగా అతడు పారిపోయాడు. వారి ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.