యాడికి: ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ.. పోలీసుల్ని చూసి హడావిడిగా ఇంటిపై నుంచి దూకి గాయాలపాలై దొరికిపోయాడు. యాడికి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
దొంగ దొరికాడు..
Feb 15 2017 12:42 AM | Updated on Aug 11 2018 6:07 PM
యాడికి: ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ.. పోలీసుల్ని చూసి హడావిడిగా ఇంటిపై నుంచి దూకి గాయాలపాలై దొరికిపోయాడు. యాడికి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శివ అనే వ్యక్తి యాడికి పాత పోలీస్‌స్టేçÙ¯ŒS సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనానికి వెళ్లాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల దృష్టి అతడిపై పడింది. పోలీసుల్ని గమనించిన శివ తప్పించుకునే యత్నంలో ఇంటిపై నుంచి కిందకు దూకి గాయాలపాలయ్యాడు. దొంగను పోలీసులు 108లో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. శివ గతంలో జరిగిన గాడిదల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
Advertisement
Advertisement