నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం అటవీ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం అటవీ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. శనివారం ఉదయం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన గోపి అనే వ్యక్తి మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పక్కనే ఉన్న టిఫిన్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వడదెబ్బ కారణంగా మృతి చెందిందా? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.