మండలంలోని మోద్గులగూడెంలో ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ఘటనలో తులం బంగారం, రూ.10వేల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం ప్రకారం.. మోద్గులగూడేనికి చెందిన నీలారపు వెంకటమ్మ ఇంట్లో గత శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వెంకటమ్మతో పాటు కుటుంబసభ్యులు బంధువుల ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
Oct 3 2016 12:08 AM | Updated on Sep 4 2017 3:55 PM
మోద్గులగూడెం(కురవి): మండలంలోని మోద్గులగూడెంలో ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ఘటనలో తులం బంగారం, రూ.10వేల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం ప్రకారం.. మోద్గులగూడేనికి చెందిన నీలారపు వెంకటమ్మ ఇంట్లో గత శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వెంకటమ్మతో పాటు కుటుంబసభ్యులు బంధువుల ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వెంకటమ్మ ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో దాచుకున్న రూ.10వేల నగదు, తులం బంగారు ఆభరణాన్ని అపహరించారు. వెంకటమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి చేరుకునే సరికి తలుపులు తీసి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి, సామాన్లు చెల్లాచెదురుగా పడవేసి కనిపించాయి. సీరోలు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా చోరీ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.
Advertisement
Advertisement