దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం | temples develpment possible by trs | Sakshi
Sakshi News home page

దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Oct 6 2016 10:44 PM | Updated on Sep 4 2017 4:25 PM

దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

యాదగిరికొండ : తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌కే సాధ్యమైందని సినీమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

యాదగిరికొండ : తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌కే సాధ్యమైందని సినీమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట  శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి దేవస్థానాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొద్ది  రోజుల్లోనే యాదగిరిగుట్ట చరిత్రనే మార్చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, స్థానిక  సర్పంచ్‌ బూడిద స్వామి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సయ్యద్‌బాబా, మిట్ట వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement