ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది.
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం తాడిపత్రిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 41.4 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 40.9 డిగ్రీలు, తాడిమర్రి 40.8 డిగ్రీలు, పుట్లూరు 40.7 డిగ్రీలు, యాడికి 40.6 డిగ్రీలు, నార్పల 40.5 డిగ్రీలు, పెద్దవడుగూరు 40 డిగ్రీలు, బెళుగుప్ప 39.7 డిగ్రీలు, తలుపుల 39.6 డిగ్రీలు, బత్తలపల్లి 39.6 డిగ్రీలు, శింగనమల 39 డిగ్రీలు, అనంతపురం 37.5 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల గరిష్టం, 25 నుంచి 27 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో వీచాయి. ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. బుక్కపట్టణం మండలంలో 12 మి.మీ. వర్షం పడింది. తనకల్లు, కనగానపల్లి, శింగనమల, గుమ్మగట్ట, ఓడీ చెరువు, నల్లమాడ, రాప్తాడు, కొత్తచెరువు తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి.