రామగుండం : ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల నాయకులపై చేసిన వాఖ్యలపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థాయిని మరిచి ఆరోపణలు చేయడంపై డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు.
మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయుల నిరసన
Aug 9 2016 5:55 PM | Updated on Oct 30 2018 7:30 PM
రామగుండం : ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల నాయకులపై చేసిన వాఖ్యలపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థాయిని మరిచి ఆరోపణలు చేయడంపై డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాఠశాలలపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతోనే పాఠశాలలు బలహీనమవుతున్నాయని డీటీఎఫ్ నాయకులు గడ్డం వెంకట్రాజం, పత్తి అనిల్‌రెడ్డి, జనార్దన్, కిరణ్, హరిప్రసాద్, రమేశ్, శ్రీకాంత్, శేఖర్, పీఆర్టీయు నాయకులు దాసరి రఘుగౌడ్, ఆకుల రాజన్న, రాచర్ల శ్రీనివాస్, దీటి శ్రీనివాస్, సతీశ్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement