పదోన్నతి పొందిన వారికి తహశీల్దార్లుగా పోస్టింగ్‌ | tahasildar postings of promotioners | Sakshi
Sakshi News home page

పదోన్నతి పొందిన వారికి తహశీల్దార్లుగా పోస్టింగ్‌

Sep 3 2017 9:51 PM | Updated on Apr 4 2019 2:50 PM

డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదంతో తహసీల్దార్లగా పదోన్నతి పొందిన వారికి జిల్లాలకు పోస్టింగ్‌ ఇచ్చారు.

అనంతపురం అర్బన్‌: డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదంతో తహసీల్దార్లగా పదోన్నతి పొందిన వారికి జిల్లాలకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈమేరకు భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులను ఆదివారం జారీ చేశారు. శీలా జయరామప్ప, అనిల్‌కుమార్, రామశేఖర్‌కు అనంతపురం జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. రామాంజినేయరెడ్డి, నారాయణకు చిత్తూరు జిల్లాలో విధులు కేటాయించారు.  అలాగే కర్నూలులో ఉన్న భాగ్యలక్ష్మికి అనంతపురం జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. పోస్టింగ్‌ పొందిన వారంతా ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద రిపోర్ట్‌  చేసుకుంటే...వారు మండలాలకు పోస్టింగ్‌ ఇస్తారు. పదోన్నతి పొందిన వారిలో ఓబన్న, భాస్కర్‌ నారాయణకు ప్రస్తుతానికి పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement