
జగిత్యాలక్రైం: ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసి న జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీ ల్దార్ రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ వివరాల ప్రకా రం.. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే విధులు నిర్వహించాడు.
ఆ సమయంలో అతనితో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సప్‌లో అసభ్యకరంగా సందేశాలు పంపాడు. ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని జగిత్యాలకు చెందిన ఓ తహసీల్దార్ మధ్యవర్తిత్వం వహించాడు. సదరు మహిళా ఉద్యోగి ఒప్పుకోకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.