‘కిసాన్’ సంబురం
పెద్దపల్లి: ఈ ఏడాది రెండో విడతను కిసాన్ సమ్మాన్ నిధులను కేంద్రప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున చెల్లించింది. పథకం ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున సాయం అందిస్తోంది.
తగ్గిన రైతుల సంఖ్య
జిల్లాలోని 65,757 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. అంతకుముందు 73,400 మంది రైతులకు సాయం అందించగా.. అనేక కారణాలు, అనర్హులను తొలగిస్తూ 65,757మందిని అర్హులుగా తేల్చింది. వీరికే రెండోవిడత నిధులు జమచేసింది.
పొరపాట్లు సరిచేయండి
జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 65,757 మంది రైతులకు రూ.2వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబరులో పొరపాట్లు సవరించి తమ వివరాలను సమర్పిస్తే.. వారికి కూడా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంది. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి


