సైబర్ మోసం.. రూ.3.3లక్షలు మాయం
ధర్మపురి: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి ఓక వేద పండితుడు మోసపోయిన ఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురికి చెందిన కొరిడె చంద్రశేఖర్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారు. శుక్రవారం తన సెల్‌ఫోన్‌లో వచ్చిన వ్యోమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయగా బ్యాంకు అధికారుల పేరుతో సైబర్ మోసగాడు లైన్లోకి వచ్చి బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు నంబర్ తెలుపాలని సూచించాడు. బాధితుడు డెబిట్‌కార్డు నంబర్ తెలుపగా 2 గంటల్లో నీ పని పూర్తి అవుతుందని సైబర్ మోసగాడు పేర్కొన్నాడు. ఈక్రమంలో చంద్రశేఖర్ బ్యాంకు ఖాతాలోని రూ.3,03,300 లక్షలు మాయం కాగా, బాధితుడు జగిత్యాల సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని.. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ కథనం మేరకు వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్‌పల్లికి చెందిన బోదాసు దేవరాజు(37) ఏడాదిగా సోదరి గ్రామం గూడెంలో ఉంటున్నాడు. కూలీ పనులకు వెళ్తున్నానని గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన దేవరాజు ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం కుటుంబ సభ్యులు వెతకగా గూడెం శివారులో చెట్టుకు ఉరివేసుకుని దేవరాజు విగతజీవిగా కనిపించాడు. ఏడాది క్రితం దేవరాజు భార్యతో గొడవపడుతున్నాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో దేవరాజు మద్యానికి బానిసయ్యాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి బోదాసు నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యం పట్టివేత
రాయికల్(జగిత్యాల): మండలంలోని కట్కాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రంజిత్‌కుమార్ అనే యువకుడు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎఫ్‌ఎస్‌టీ సభ్యులు పట్టుకున్నారు. రూ.4,500 విలువ గల 12 బీర్లు, 12 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌టీ సభ్యులు పద్మయ్య, రంజిత్‌కుమార్, తిరుపతి పాల్గొన్నారు.
సైబర్ మోసం.. రూ.3.3లక్షలు మాయం


