హామీల బాండ్ పేపర్ విడుదల
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్‌లో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ఆకుల మణక్క తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ పేపర్ విడుదల చేశారు. సర్పంచ్‌గా పోటీచేస్తున్న ఆమె.. అభివృద్ధి పనులు చేపడతామని శుక్రవారం బాండ్ పేపర్‌పై రాసి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ 40 ఏళ్లుగా గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, తనను గెలిపిస్తే ఐదేళ్లలోనే 14 సమస్యలు పరిష్కరిస్తానని బాండ్ పేపర్ రాశారు. ఆ పేపర్‌ను అభిమానులు, ఓటర్ల మధ్య విడుదల చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.


