అనంతపురం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి నిర్మించ తలపెట్టిన 6 లైన్ల ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారికి సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి.
నేషనల్ హైవే నిర్మాణానికి సర్వే
Mar 1 2017 12:28 AM | Updated on May 25 2018 7:10 PM
ఉయ్యాలవాడ: అనంతపురం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి నిర్మించ తలపెట్టిన 6 లైన్ల ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారికి సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం మండలంలోని అల్లూరు, సుద్దమల్ల గ్రామాల సమీపంలో పంట పొలాల్లో రహదారి కోసం సర్వే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ డిజైన్ సంస్థ సర్వే ప్రతినిధి రంగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో అమరావతి జాతీయ రహదారి కోసం 60కిలో మీటర్ల దూరం సర్వే పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం నుంచి పనులు ప్రారంభించామని 150 మీటర్ల వెడల్పు విస్తీర్ణంతో గుర్తులు వేశామన్నారు. ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల వరకు పొలాల్లో సర్వే పూర్తయిందన్నారు.
Advertisement
Advertisement