తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం | suicide attept in drunkenness | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం

Jan 8 2017 2:25 AM | Updated on Sep 5 2018 9:47 PM

తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం - Sakshi

తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం

తాగిన మైకంలో ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తాళ్లపూడిలో శనివారం చోటుచేసుకుంది.

కొవ్వూరు రూరల్‌ : తాగిన మైకంలో ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తాళ్లపూడిలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు, కొవ్వూరు ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపూడికి చెందిన ఊబా శ్రీనివాస్‌ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో శరీరం పూర్తిగా కాలిపోయింది. అతడిని బంధువులు 108లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుధీర్‌ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement