విత్తన భాండాగారంగా రాష్ట్రం | State Seed archive | Sakshi
Sakshi News home page

విత్తన భాండాగారంగా రాష్ట్రం

Oct 26 2015 1:22 AM | Updated on Jun 4 2019 5:04 PM

విత్తన భాండాగారంగా రాష్ట్రం - Sakshi

విత్తన భాండాగారంగా రాష్ట్రం

రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు మొ దలుపెట్టింది. ఇప్పటికే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

♦ ఆ దిశగా సర్కారు కసరత్తు
♦ రేపటి నుంచి హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్
♦ ప్రారంభ కార్యక్రమానికి సీఎం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు మొ దలుపెట్టింది.  ఇప్పటికే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అయినా విత్తన ఉత్పత్తి, ఎగుమతి మరింత విస్తృతం చేసి రైతులకు లాభసాటిగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీలు, ఈ రంగంలోని దేశ విదేశీ ప్రముఖులను ఒకచోట చేర్చి ప్రణాళిక రూపొందించనుంది. ఈ మేరకు మంగళ వారం నుంచి ఈ నెల 29 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ విత్తన కాంగ్రెస్‌లో చర్చలు జరుపనుంది. ఈ సదస్సు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి పది రోజులుగా ఈ పని లో నిమగ్నమయ్యారు. సదస్సుకు దేశవిదేశాల నుంచి 500 మంది శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి కూడా పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. విత్తనరంగంలో వస్తున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞా నం, విత్తన నాణ్యత, రైతుకు లాభసాటిగా తయారుచేయడానికి అనుసరించాల్సిన పద్ధ తులపై సదస్సులో చర్చిస్తారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తయారుచేయాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సదస్సును ఉపయోగించుకోవాలన్నది సర్కారు యోచన.

 70 శాతం తెలంగాణలోనే..
 ప్రస్తుతం ప్రైవేటు, బహుళజాతి కంపెనీలతో కలుపుకొని దేశంలో ఉత్పత్తయ్యే విత్తనాల్లో 70 శాతం తెలంగాణలోనే తయారవుతాయి. అందులో 62 శాతం ఎగుమతి అవుతాయి. 11 దేశాలకు సరఫరా అవుతున్నాయి. మొత్తం విత్తన ఉత్పత్తిలో ప్రైవేటు వాటా 88 శాతం. ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాటా 12 శాతం. ఏటా హైబ్రీడ్ రకాలకు చెందిన వరి విత్తనం 75 వేల ఎకరాల్లో సాగవుతోంది. కూరగాయలు, సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదు. తెలంగాణలో ఉన్న నేలలు, వాతావరణ పరిస్థితి విత్తన తయారీకి అనుకూలం కాబట్టి ఈ పరిస్థితిని రైతుకు అనుగుణంగా మలచాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడుల వంటి వాటితో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే విత్తనోత్పత్తి కీలకమని వ్యవసాయశాఖ చెబుతోంది. సాధారణ పంటలతో పోలిస్తే దీనివల్ల రెండు మూడు రెట్లు ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement