శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం | srivari pavitrostavalu | Sakshi
Sakshi News home page

శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం

Aug 16 2016 10:33 PM | Updated on Sep 4 2017 9:31 AM

శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం

శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో వేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దీంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం పవిత్రాదివాసం జరుపనున్నట్టు అర్చకులు తెలిపారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement