పుష్కర భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని 12 ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం భట్టు చిట్టిబాబు తెలిపారు.
అనంతపురం న్యూసిటీ: పుష్కర భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని 12 ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం భట్టు చిట్టిబాబు తెలిపారు. విజయవాడకు రెగ్యులర్‌గా నడిపే 12 బస్సులతో పాటు మరో 15 బస్సులను అదనంగా పంపుతున్నామన్నారు. అలాగే కర్నూలుకు 25 ఎక్స్‌ప్రెస్ బస్సులు, విజయవాడకు 175 బస్సులు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో విజయవాడకు 100, కర్నూలుకు 75 బస్సులు కేటాయించామన్నారు.
అనంతపురం బస్సులు బయలుదేరే సమయం
డిపో ఉదయం సాయంత్రం
అనంతపురం – విజయవాడ 6 గంటలకు 5 గంటలకు
హిందూపురం–విజయవాడ 5 గంటలకు 5గంటలకు
ఉరవకొండ–విజయవాడ 5 గంటలకు 7 గంటలకు
తాడిపత్రి–విజయవాడ 7గంటలకు 6 గంటలకు
గుంతకల్లు–విజయవాడ 8గంటలకు 8 గంటలకు
కదిరి–విజయవాడ(ఈ బస్సు కదిరి నుంచే వెళ్తుంది.అనంతకు రాదు) 8 గంటలకు 8 గంటలకు
పుట్టపర్తి 8.30 గంటలకు –
అనంతపురం–శ్రీశైలం 6.గంటలకు –
అనంతపురం–బీచుపల్లి 7గంటలకు –