సౌదీలో ప్రమాదం..సిరిసిల్ల యువకుడి మృతి | sircilla person died in saudi | Sakshi
Sakshi News home page

సౌదీలో ప్రమాదం..సిరిసిల్ల యువకుడి మృతి

Apr 27 2017 6:46 PM | Updated on Aug 20 2018 7:33 PM

గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

కోనరావుపేట(రాజన్నసిరిసిల్ల): గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కులేరు దేవరాజు(35) 20 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడి బల్దియా కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ ఉదయం విధులకు వెళ్తుండగా  సల్వా ప్రాంతంలో వాహనం ఢీకొట్టింది.

తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, తోటివారు కుటుంబీకుల ఆలస్యంగా సమాచారాన్ని అందించారు. దేవరాజు మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు వారికి హామీ ఇచ్చారు. మృతునికి భార్య స్వప్న, ఏడాదిన్నర కుమారుడు, తండ్రి రాజయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement