తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు అందించారు.
► కానిస్టేబుల్ రఫీద్‌కు శౌర్య పతకం
► గత ఏడాది ప్రకటన
► పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రదానం చేసిన సీఎం
మహబూబ్‌నగర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు అందించారు. వీటిని పొందిన వారిలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఒకే ఒక్క కానిస్టేబుల్ ఉన్నారు. కోయిలకొండ మండలం రామ్‌పూర్‌కు చెందిన రఫీద్ 2009లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తించిన పోలీసువిభాగం ముఖ్యమంత్రి శౌర్య పతకం ప్రదానం చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో గతేడాది ప్రభుత్వం రఫీద్‌కు ఈ పతకాన్ని ప్రకటించింది. గురువారం పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం చేతుల మీదుగా రఫీద్ ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని అందుకున్నారు.