2న దేశవ్యాప్త సమ్మె | sep 2nd nationwide strike | Sakshi
Sakshi News home page

2న దేశవ్యాప్త సమ్మె

Aug 23 2016 11:39 PM | Updated on Sep 4 2017 10:33 AM

కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను ఏజెన్సీలోని కార్మిక వర్గాలన్నీ విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు పుణ్యారావు కోరారు

హుకుంపేట:  కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను ఏజెన్సీలోని కార్మిక వర్గాలన్నీ విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు పుణ్యారావు కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌తో సీఐటీయు, అనుబంధ కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె చేపడుతున్నాయన్నారు. నిత్యావసరాల ధరలు అధికంగా పెరుగుతున్నా కార్మికులకు మాత్రం చాలీచాలని వేతనాలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కొండలరావు, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement