ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల సీజ్‌ | sand tractors sieze | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల సీజ్‌

Oct 26 2016 12:34 AM | Updated on Sep 4 2017 6:17 PM

బుట్టాయగూడెం : మండలంలోని కొవ్వాడ కాలువ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్‌ చేసి పోలీసులకు అప్పగించారు.

బుట్టాయగూడెం : మండలంలోని కొవ్వాడ కాలువ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్‌ చేసి పోలీసులకు అప్పగించారు. తహసీల్దార్‌ ఎ.జి.చిన్నికృష్ణ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలానికి చెందిన మూడు ట్రాక్టర్లు బుట్టాయగూడెం మండలం కొవ్వాడ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో వీఆర్‌ఏ పోతురాజు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మూడు ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సీజ్‌ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్ల యజమానులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ పేర్కొన్నారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే  చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement