బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి | road accident in vijayawada | Sakshi
Sakshi News home page

బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Aug 23 2016 2:29 PM | Updated on Aug 14 2018 3:22 PM

బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి - Sakshi

బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మృతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. కృష్ణా పుష్కరాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నుంచి తిరిగి వెళ్లే యాత్రికులు వాహనాలు నడపడంలో జాగ్రతగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement