'టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి' | r krishnaiah fires on telangana government on tet issue | Sakshi
Sakshi News home page

'టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి'

Mar 2 2016 3:16 PM | Updated on Sep 3 2017 6:51 PM

తెలంగాణ ప్రభుత్వం టెట్ను వాయిదా వేసి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేయొద్దని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సూచించారు.

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం టెట్ను వాయిదా వేసి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేయొద్దని  టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సూచించారు. బుధవారం కరీంనగర్లో నిరుద్యోగ గర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెట్ లేకుండా డీఎస్సీని నిర్వహించి రాష్ట్రంలోని 43 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటికో ఉద్యోగం ఇచ్చేంతవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇందుకోసం విద్యార్థులతో కలిసి చదువు-ఉద్యమించు, ఉద్యోగం-సాధించు నినాదంతో పోరాడుతామని ఆయన వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement