ఇబ్రహీంపట్నంలో పోలీసుల అత్యుత్సాహం | Police Overaction on ysrcp flexies in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఫ్లెక్సీలకు తప్ప ఎవరికీ అనుమతిలేదు'

Aug 11 2016 3:26 PM | Updated on Aug 21 2018 8:00 PM

వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు చేసుకున్న కృష్ణా పుష్కరాల ఫ్లెక్సీలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సొంత భవనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసుకున్న కృష్ణా పుష్కరాల ఫ్లెక్సీలను తొలంగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తప్ప ఎవరికీ అనుమతి లేదని హెచ్చరించారు.

బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీసులు తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు జోగి రమేష్, నాగిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీల తొలగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడంపై వారు నిరసన తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నామని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement