విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ | plates distribution for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

Aug 29 2016 8:38 PM | Updated on Mar 22 2019 7:19 PM

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ - Sakshi

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

హాలియా : మండలంలోని ఎల్లాపురం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాతల పలు వస్తువులను అందజేశారు.

హాలియా : మండలంలోని ఎల్లాపురం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాతల పలు వస్తువులను అందజేశారు. పాఠశాలకు రూ.4500 ల విలువ గల బీరువాను సర్పంచ్‌ కె.లలిత, రూ.2300ల విలువ గల టేబుల్‌ను ఎంపీటీసీ గుండెబోయిన కాశమ్మ, రూ.1500ల విలువ గల ప్లేట్లు రావులపాటి సైదులు, రూ.1200 ల విలువ గల ఛైర్‌ను మారెపాక జానీ, రూ.1000ల విలువ గల వాటర్‌ ప్యూరిఫైర్‌ను రావులపాటి రాజు, రూ500ల విలువ గల పలకలు గుర్నాథంలు అందజేశారు. అనంతరం మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు సహకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రవికుమార్, గుండెబోయిన అంజి యాదవ్‌ ప్రధానోపాధ్యాయులు బాణావత్‌ వెంకన్న, పరశురామ్, నెమలి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement