ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చి అనంత లోకాలకు.. | piigrim dead in line | Sakshi
Sakshi News home page

ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చి అనంత లోకాలకు..

Jan 9 2017 1:44 AM | Updated on Sep 5 2017 12:45 AM

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారా దర్శనం నిమిత్తం క్యూలైన్‌లో నిలుచున్న భక్తుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు.

ద్వారకాతిరుమల/ఆకివీడు: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారా దర్శనం నిమిత్తం క్యూలైన్‌లో నిలుచున్న భక్తుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఆకివీడుకు చెందిన లారీ యజమాని రెడ్డి జగదీశ్వరరావు (54), భార్య, ముగ్గురు కుమారులతో కలిసి ఉదయం చినవెంకన్న క్షేత్రానికి వచ్చారు. దర్శనం నిమిత్తం క్యూలైన్‌లో వేచి ఉండగా జగదీశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు, కొందరు భక్తులు ఆయన్ను హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే జగదీశ్వరరావు మృతి చెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆకివీడులోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement