ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి | person died ina well | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి

Jan 12 2017 10:07 PM | Updated on Sep 28 2018 3:41 PM

పిడుగురాళ్ళ/మాచవరం : ​‍​‍ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

 
పిడుగురాళ్ళ/మాచవరం : ​‍​‍ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఆవుల సాయికుమార్‌ (21) ఇంజిన్‌ ఫుట్‌భాల్‌ పైకి తీసే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.సాయికుమార్‌తోపాటు వెళ్ళిన వ్యక్తి కేకలు వేసినప్పటికీ చుట్టుపక్కల పొలాల రైతులు సంఘటనా స్థలానికి వచ్చి బావిలో ఉన్న సాయికుమార్‌ను పైకి తీసి పిడుగురాళ్ళ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు పరీశీలించి సాయికుమార్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. 

Advertisement
 
Advertisement
Advertisement