చికిత్సపొందుతూ వ్యక్తి మృతి | person die with seeking treatment | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

Aug 9 2016 10:21 PM | Updated on Sep 28 2018 3:39 PM

నిమ్మతోట ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మండల పరిధిలోని చెన్నకేశ్వాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల వెంకన్న(42) ఈ నెల ఏడో తేదీన తన నిమ్మ తోట వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో తీవ్రగాయాలపాలయ్యాడు.

చెన్నకేశ్వాపురం(నడిగూడెం): నిమ్మతోట ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మండల పరిధిలోని చెన్నకేశ్వాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల వెంకన్న(42) ఈ నెల ఏడో తేదీన తన నిమ్మ తోట వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement