మాగోడు పట్టించుకోరా ! | people strikes for drinking water in hindupur | Sakshi
Sakshi News home page

మాగోడు పట్టించుకోరా !

Apr 15 2017 11:59 PM | Updated on Oct 4 2018 5:34 PM

మాగోడు పట్టించుకోరా ! - Sakshi

మాగోడు పట్టించుకోరా !

‘తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు మాగోడు పట్టించుకోరా’ అని కొట్నూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురం అర్బన్‌ : ‘తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు మాగోడు పట్టించుకోరా’ అని కొట్నూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం వారు పెనుకొండ రహదారిలో ఖాళీబిందెలతో బైఠాయించి నీళ్లు కావాలంటూ నినాదాలు చేశారు. అధికారులు సమస్య తీర్చే వరకూ కదలమంటూ భీష్మించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, కౌన్సిలర్‌ దాదాపీర్‌ వారికి మద్దతుగా నిలిచారు. రోడ్డుపై బైఠాయించడంతో పెనుకొండ రహదారి, కొట్నూరుకట్టపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు గ్రామస్తులకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. నీళ్లు ఇవ్వనిదే తాము వెళ్లేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో మున్సిపల్‌ డీఈ వన్నూరుస్వామి అక్కడికి చేరుకుని కోట్నూరు ప్రాంతంలో అవసరమైన నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శాంతించి రాస్తారోకో విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement