మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

people sharing their sorrows in grievence - Sakshi

గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదు

గుంటూరు: మీటరు వడ్డీల కారణంగా తమ కుంటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని కొందరు.... తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా అప్పు అడిగితే హతమార్చుతానని బెదిరిస్తున్నాడంటూ మరికొందరు..భర్తను గుర్తించి తన కాపురం చక్కదిద్దాలంటూ  బాధితులు తమ సమస్యలను విన్నవించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని అర్బన్, రూరల్‌ ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్‌ జరిగింది. అర్బన్, రూరల్‌ అదనపు ఎస్పీలు వైటీ. నాయుడు, వరదరాజు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  సమస్యలు కొన్ని వారి మాటల్లోనే...

ప్లాట్‌ ఇస్తానని డబ్బు తీసుకున్నాడు
బెల్లంకొండలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న ఏలూరు శ్రీనివాసరావు గుంటూరులోని రాజీవ్‌ గృహకల్పలో అతడికి ప్లాట్‌ ఉందని, అది విక్రయిస్తున్నానని చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి గతేడాది రూ. 1.70 లక్షలు చెల్లించాను. అప్పట్లో అగ్రిమెంట్‌ కూడా రాసి ఇచ్చాడు. ప్లాట్‌ అప్పగించమని అడిగితే అందుకు నిరాకరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలి. – బి. సీతారామయ్య, బ్రాడీపేట, గుంటూరు

టేకు చెట్లను నరికేశారు
వారసత్వంగా వచ్చిన రెండున్నర ఎకరాల భూమిలో ఉన్న టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. వాటి విలువ సుమారుగా రూ. 2 కోట్లు ఉంటుంది. నాభూమిని ఆక్రమించుకునే కుట్రలో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ టేకు చెట్లను ప్రభుత్వం ద్వారా నాకు అప్పగించేలా చర్యలు చేపట్టాలి. అక్రమంగా నరికి వేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలి.
– పెరుమాళ్ల అహోబలప్రతాప్, సత్తెనపల్లి

మీటరు వడ్డీతో అల్లాడుతున్నాం
శ్యామలానగర్‌లోని విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్న భాస్కర్‌రెడ్డి వద్ద మా అవసరాల నిమిత్తం ఒక్కొక్కరం రూ. 20వేలు చొప్పున అప్పుగా తీసుకున్నాం. కూలి పనులు చేసుకుంటూ వాటిని తీర్చుకుంటూ వస్తున్నాం. అయితే వడ్డీలకు వడ్డీలు చెల్లించాలని, లేకుంటే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు. అతని నుంచి రక్షణ కల్పించాలి.– అంజిబాబు, పూర్ణ, చంటి తదితరులు మంగళదాస్‌నగర్, గుంటూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top