30 శాతం కమీషన్‌కు పాత నోట్లు మార్చి కొత్తనోట్లు ఇస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పెద్దనోట్ల మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్
Nov 28 2016 12:25 PM | Updated on Aug 20 2018 4:44 PM
పెద్దపల్లి: 30 శాతం కమీషన్‌కు పాత నోట్లు మార్చి కొత్తనోట్లు ఇస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా పాత పెద్ద నోట్లను తీసుకొని రెండు వేల రూపాయల నోట్లు చేస్తున్న వారిపై దృష్టి సారించిన పోలీసులు ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
పెద్దపల్లికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.కోటి మార్చడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ముఠా సభ్యులు తొలి విడుతగా రూ.10 లక్షలు ఇస్తుండగా పట్టుకుని నగదును సీజ్ చేశారు.
Advertisement


