ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను 2013 చట్టం ప్రకారం తీసుకోవాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు.
ఇక్కడ చేపట్టిన జీఓ 45పై కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా జిల్లాలో ఫార్మాసిటీకి ఎక్కడ భూములు తీసుకుంటున్నా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంబయ్యయాదవ్, జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణనాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ప్రసూన, మహేశ్వరం ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ స్వప్న, జల్‌పల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, చిర్ర సారుు లు, దర్శన్‌రెడ్డి, శివమూర్తి, పాండుగౌడ్, బాబయ్య, కమాల్‌ఖాన్, వీరారెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజు, రాజేష్, వెంకట్‌రాంరెడ్డి, రాములు, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్త య్య తదితరులు పాల్గొన్నారు.